Saturday 10 November 2018

హాయ్ ఫ్రెండ్స్ రాష్ట్రములో ఉన్న 26000 వేల మంది రేషన్ డీలర్స్ వారి జీవన విధానం పై చిన్న కధనం
2014 సంవత్సరములో పౌరసరఫరాల శాఖలో అవినీతిని తగ్గించడానికి రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న అన్ని రేషన్ దుకాణాలలో ఈపాస్ యంత్రాలు ప్రవేశపెట్టడం జరిగింది దీంతో ప్రభుత్వానికి సుమారుగా నెలకు 1000 కోట్లు పైన మిగిలింది , అదేవిధముగా రేషన్ డీలర్స్ యొక్క ఆదాయం తగ్గింది అనడములో ఎటువంటి సందేహము అవసరం లేదు 2014 సంవత్సరము నుండి ప్రతి డీలర్ సరి అయినా ఆదాయం లేక రేషన్ దుకాణాన్ని వదులుకోలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదర్కొంటూ జీవాన్ని సాగిస్తున్నారు
ఇటువంటి సందర్భములో ప్రభుత్వం రేషన్ డీలర్లుకి ఎటువంటి కమిషన్ చెల్లించకుండా రేషన్ డీలర్స్ ని మరియు వ్యవస్థని నాశనం చేయడానికి జీవో నెంబర్ 15 ద్వారా రేషన్ డీలర్ ఎటువంటి చిన్న తప్పు చేసిన రేషన్ షాప్ ఊడిపోయే విధముగా ఈ జీవో ఉంది అని పలువురు డీలర్స్ సంగం నాయకులూ ఆరోపిస్తున్నారు
తక్షణం ప్రభుత్వం స్పందించి డీలర్స్ కి వేతనాలు ఇవ్వాలి అని పలువురు కోరుతున్నారు

No comments:

Post a Comment